రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే సంక్షేమ పాలన
కాకతీయ, పెద్దవంగర : సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రవీందర్ రెడ్డి, తోటకూరి శ్రీనివాస్, అనపురం శ్రీనివాస్, సోమన్న నాయక్, గోపాల్ నాయక్, చంద్రశేఖర్, వెంకన్న నాయక్, సంపత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు


