కొత్తూరు గ్రామ లంబాడీ జేఏసీ నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షులుగా జాటోత్ రాజేందర్ నాయక్
కాకతీయ,ఖానాపురం : ఖానాపురం మండలం కొత్తూరు గ్రామ లంబాడి జేఏసీ కన్వీనర్ గా జాటోత్ రాజేందర్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఖానాపురం లంబాడి మండల జేఏసీ కన్వీనర్ గుగులోతు కిషన్ నాయక్, ముఖ్య సలహాదారులు జాటోత్ బాలు నాయక్ బాదావత్ బాలకిషన్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఇన్నాళ్లు అన్నదమ్ముల్ల కలిసి మెలిసి ఉన్న ఎస్టి కులాల మధ్య విభేదాలను సృష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తుందని, దీనిని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో లంబాడి జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం కొత్తూరు గ్రామ లంబాడి జేఏసీ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగిందనీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా జాటోత్ రాజేందర్ నాయక్, ఉపాధ్యక్షులు జాటోత్ భద్రు నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జాటోత్ యాకూబ్ నాయక్,జాటోత్ వాసురాం నాయక్,కో కన్వీనర్ జాటోత్ కిషన్ నాయక్, అజ్మీర శ్రీను నాయక్ జాటోత్ రాజ్ కుమార్ నాయక్,అంగోత్ అశోక్ నాయక్,జాటో త్ జోహార్ లాల్ నాయక్,జాటోత్ ఎల్లయ్య నాయక్,జాటోత్ రాజు నాయక్,అజ్మీర రాజు నాయక్,నరసింహ నాయక్,రాజు నాయక్, జాటోత్ గోవిందు నాయక్,జాటోత్ రవీందర్ నాయక్,లావుడియా కుమార్ స్వామి నాయక్ తండా వాసులు పాల్గొన్నారు.


