కాకతీయ, పెద్దవంగర: సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని ఎస్సై ప్రమోద్ కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆరు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. మండల ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. మండలంలో నేరాల సంఖ్య తగ్గించుటకు, శాంతి భద్రతలను కాపాడుటలో, తమ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా గుర్తుతెలియని వ్యక్తులు తిరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఎస్సై అన్నారు.


