కాకతీయ, దుగ్గొండి: మండలంలోని గుడ్డెలుగులపల్లి గ్రామానికి చెందిన చెల్పూరి అశోక్ కుమారుడు గణేష్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా శనివారం మృతుడి కుటుంబాన్ని మండల కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి కూరతోట సురేష్ పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్, మాజీ ఎంపీపీ బూరుగు రవీందర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు జంగిలి నగేష్, నాయకులు ఎడెల్లి శ్రీనివాస్ రెడ్డి, జంగిలి రవి, డ్యాగం శివాజీ, బండారి ప్రకాష్, శెంకేషి రమేష్, తొర్రురు సుధాకర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.


