సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అల్ఫోర్స్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌరస్తా వద్ద జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి రంగంలో అభివృద్ధి సాధించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. విద్య, క్రీడ, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, పార్టీ శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగి అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికీ అందిస్తున్నదని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. డిసిసి కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, డిసిసి బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ లతో కలిసి కేక్ కట్ చేశారు.ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి గుండాటి శ్రీనివాస్ రెడ్డి, డిసిసి ఎస్‌సి సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చర్ల పద్మ, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్నం రజిత రెడ్డి నేతృత్వంలో భారీ కేక్ కట్ చేశారు.మార్కెట్ రోడ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రజిత రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మైత్రి కన్వెన్షన్ వద్ద దీకొండ శేఖర్ ఆధ్వర్యంలో, హైమద్‌పుర చౌరస్తా వద్ద యూత్ కాంగ్రెస్ నేత మహమ్మద్ ఖలీం ఆధ్వర్యంలో కూడా వేడుకలు జరిగాయి.ఈ సందర్భంగా కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి కృషి వలననే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగామని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.వేడుకల్లో శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, ముస్తాక్ అహ్మద్, బొబ్బిలి విక్టర్, కుర్ర పోచయ్య, వంగల విద్యాసాగర్, సలీముద్దీన్, చింతల కిషన్, కుంభాల రాజ్‌కుమార్, యనమల మంజుల, పర్వత మల్లేశం, అంజయ్య, ఈశ్వరి, నూనె గోపాల్ రెడ్డి, సుధాకర్ నాయక్, మాదాసు శ్రీనివాస్, మూల జైపాల్, సత్తినేని శ్రీకాంత్, స్వప్నశ్రీ, మాలోతు మహాలక్ష్మి, హైమద్, ఆమీర్ సిరిపురం నాగప్రసాద్, చింతల కిషన్, ఎలగందుల మునీందర్, భూసా ప్రశాంత్, అంజాద్ ముహమ్మద్, అతిబ్ సాదిక్, వాజిద్, ఎకరం సికందర్, సోహెల్, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


