పోలీసులపై మందుబాబుల దాడి.
బహిరంగంగా మద్యం సేవించడంపై మందలించిన పోలీసులు
రెచ్చిపోయి దాడి చేసిన మందుబాబులు.. ఆలస్యంగా వెలుగులోకి
కాకతీయ, వెబ్‌డెస్క్ : పోలీసులపై మందు బాబులు దాడి చేసిన ఘటన నల్గొండ జిల్లా చండూరులో చోటు చేసుకుంది. ఈసంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బహిరంగ ప్రదేశంలోమద్యం సేవిస్తున్న ముగ్గురు మందుబాబులను పోలీసులు మందలించడంతో మత్తులో రెచ్చిపోయారు. మద్యం మత్తులో విచక్షణ రహితంగా దాడి చేయడంతో పోలీసులకు గాయలైనట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై బాధిత పోలీసులు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


