దుగ్గొండి మండలంలో ఘనంగా 77 వ ఘనతంత్ర దినోత్సవ వేడుకలు
కాకతీయ, దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో రాజేశ్వర్ రావు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అరుంధతి, పోలీస్ స్టేషన్ లో ఎస్సై రణధీర్ రెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక గిర్దావర్ సాయిరాం రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ చుక్క రమేష్, బీజేపీ నేదురు రాజేందర్, బిఆర్ఎస్ మాజీ ఉప సర్పంచ్ సుధాకర్ మండల పార్టీల కార్యాలయ వద్ద జాతీయ జెండాను ఎగరవేసి, జాతీయ గీతాలాపన గావించారు. దుగ్గొండి మేజర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో డిప్యూటీ తహసీల్దార్ ఉమారాణి, మండల వ్యవసాయ అధికారి గాజుల శ్యామ్, పంచాయితీ అధికారి, శ్రీధర్ గౌడ్, ఏపివో శ్రీనివాస్, ఏపీఎం రమేష్, రెవిన్యూ సిబ్బంది, ఏఈవో లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


