epaper
Monday, January 26, 2026
epaper

భూమి లేనివారికి 72 గజాల స్థ‌లం.. ఇళ్లు

భూమి లేనివారికి 72 గజాల స్థ‌లం.. ఇళ్లు
భూమిలేని పేద‌ల‌కు ఇళ్లు నిర్మించి ఇస్తాం
రైతులకు మేలు చేసేందుకే భూభారతి చట్టం
మహబూబాబాద్ జిల్లాకు రూ.3.16 కోట్ల లబ్ధి
సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్
రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కాకతీయ, మరిపెడ : పదేళ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చుట్టంలాంటి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి వారి సమస్యలకు పరిష్కారం చూపుతోందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూమిలేని పట్టణ ప్రజలకు 72 గజాల విస్తీర్ణంతో ఇళ్లను నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. సోమవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి అర్హులైన రైతులకు మంజూరైన సబ్సిడీ వ్యవసాయ యంత్రాలను మంత్రి, ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే , డాక్టర్ జాటోతు రామచంద్రు నాయక్‌తో కలిసి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.

కోట్ల రూపాయల లబ్ధి..!

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రూ.3.16 కోట్ల విలువైన రైతు పనిముట్లను పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా అర్హులైన రైతులందరికీ ఈ యంత్రాలను అందజేస్తామని చెప్పారు. రైతుల ఆదాయం పెంపుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని కోరుకున్నారని, రైతుల కష్టాలు ప్రజా ప్రభుత్వంతోనే తీరుతాయని స్పష్టమైందన్నారు. రైతులను ఇబ్బంది పెట్టిన బీఆర్‌ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని వ్యాఖ్యానించారు. రైతులకు గుదిబండగా మారిన ధరణిని బంగాళాఖాతంలో వేసి, భూభారతి వంటి చట్టాన్ని తీసుకొచ్చి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని తెలిపారు.

సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సన్నాలు పండించిన రైతులందరికీ క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తున్నామని చెప్పారు. నిరుపేదల సుభిక్షం కోసం సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, వడ్డీ లేని రుణాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో సుమారు 26 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కొమ్ము యుగంధర్ రెడ్డి, యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి, మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి, పట్టణ అధ్యక్షులు షేక్ తాజుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు రవి నాయక్, ఆత్మ కమిటీ చైర్మన్ నళ్ళు సుధాకర్ రెడ్డి, అధికారులు ఏడీఏ విజయచంద్ర, మండల వ్యవసాయ అధికారి బోడ వీరాసింగ్, తాసిల్దార్ కృష్ణవేణి, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ విజయానంద్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వరంగల్ నగరం త్రివర్ణ శోభితం

వరంగల్ నగరం త్రివర్ణ శోభితం బల్దియా, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణలు మువ్వన్నెల తోరణాలు,...

అనుమానాస్పద స్థితిలో వ్య‌క్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్య‌క్తి మృతి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు, దర్యాప్తు కాకతీయ /...

బీజేపీకి అరూరి ర‌మేష్‌ గుడ్‌బై…

బీజేపీకి అరూరి ర‌మేష్‌ గుడ్‌బై… బీఆర్ ఎస్‌లోకి వ‌ర్ధ‌న్న‌పేట మాజీ ఎమ్మెల్యే...

ఉత్త‌మ ఉద్యోగిగా సీఐ విశ్వేశ్వర్‌

ఉత్త‌మ ఉద్యోగిగా సీఐ విశ్వేశ్వర్‌ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ పురస్కారం ప్రదానం ప్రజల...

మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు…

మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు… పరకాల పశువుల అంగడి నుండి బస్సులు...

ఉపాధి హామీలో గాంధీ పేరు తొలగింపు సిగ్గుచేటు!

ఉపాధి హామీలో గాంధీ పేరు తొలగింపు సిగ్గుచేటు! బీజేపీకి చరిత్రపై గౌరవం లేదా? గాంధీ...

దుగ్గొండి అధికారులకు జిల్లా స్థాయి గుర్తింపు

దుగ్గొండి అధికారులకు జిల్లా స్థాయి గుర్తింపు సీఐ, తహసీల్దార్, ఎంపీడీఓకు ఉత్తమ అవార్డులు గణతంత్ర...

గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఆటో డ్రైవర్

గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఆటో డ్రైవర్ 10 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం గంజాయి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img