epaper
Monday, March 2, 2026
epaper

490 వెంటిలేటర్లు 9 ఎంఆర్‌ఐ యంత్రాలు

490 వెంటిలేటర్లు 9 ఎంఆర్‌ఐ యంత్రాలు

ప్రభుత్వ హాస్పిటళ్లలో అదనంగా ఏర్పాటు

ప్రస్తుతం ద‌వాఖాన‌ల్లో 1790 వెంటిలేటర్ బెడ్లు

మరో 490 వెంటిలేటర్ల కొనుగోలుకు చ‌ర్య‌లు

మంత్రి దామోదర్ రాజనర్సింహ

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ హాస్పిటళ్లలో అదనంగా 490 వెంటిలేటర్లు, 9 ఎంఆర్‌ఐ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ఈ మేరకు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ దవాఖాన్లలో వెంటిలేటర్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్స్‌లో సుమారు 1790 వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయి. ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్య సేవలు మెరుగు పడ్డాయి.
దీంతో ప్రభుత్వ హాస్పిటళ్లకు చికిత్స కోసం వచ్చే పేషెంట్ల సంఖ్య పెరిగింది. ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్ బెడ్ల అవసరం పెరిగింద‌న్నారు. పెరిగిన అవసరాలకు అనుగుణంగా మరో 490 వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నాం. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం వంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్, జిల్లా హాస్పిటళ్లలో వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.. అని వెల్ల‌డించారు.

వందకుపైగా డయాలసిస్ మిషన్లు

నిమ్స్‌కు కెపాసిటీకి మించి పేషెంట్లు వస్తున్నారు. చివరి నిమిషంలో ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్ల నుంచి వెంటిలేటర్ మీద నిమ్స్‌కు వచ్చే పేషెంట్ల సంఖ్య ఎక్కువైంది. పెరిగిన అవసరాలకు అనుగుణంగా నిమ్స్‌లో అదనంగా మరో 125 వెంటిలెటర్లు ఏర్పాటు చేస్తున్నాం. నిమ్స్‌లో కొత్తగా సుమారు 850 పోస్టులను భర్తీ చేయబోతున్నాం. గాంధీ, ఉస్మానియా, ఆదిలాబాద్ రిమ్స్‌, ఎంజీఎంలో మాత్రమే ఎంఆర్‌‌ఐ యంత్రాలు ఉన్నాయి. మరో 9 ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఎంఆర్‌‌ఐ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. గతేడాది కొత్తగా 213 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాం. దీంతో ఎమర్జన్సీ రెస్పాన్స్‌ 18 నిమిషాల నుంచి 13 నిమిషాలకు తగ్గింది. ఈ ఏడాది మరో 79 కొత్త అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ఇవి అందుబాటులోకి వచ్చాక ఎమర్జన్సీ రెస్పాన్స్ టైమ్ 10 నిమిషాలకు తగ్గుతుంది. ఈ రెండేండ్లలో కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఎగ్జిస్టింగ్ డయాలసిస్ సెంటర్లలో వందకుపైగా డయాలసిస్ మిషన్లను అదనంగా అందుబాటులోకి తీసుకొచ్చాం.. అని దామోద‌ర తెలిపారు.

రాష్ట్రంలోని ఏ పాయింట్ నుంచైనా..

రాష్ట్రంలోని ఏ పాయింట్ నుంచైనా 20 నిమిషాల ప్రయాణంలోనే డయాలసిస్ సెంటర్ ఉండేలా, ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాం. డయాలసిస్ పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిది. క్యూర్ ఏరియాలో బస్తీ దవాఖాన్లను బలోపేతం చేస్తున్నాం. బస్తీ దవాఖాన్లకు ఇంతకుముందు పీహెచ్‌సీల నుంచి సరఫరా చేసేది. ఇకపై సెంట్రల్ మెడిసినల్ స్టోర్స్ నుంచి నేరుగా బస్తీ దవాఖాన్లకు పంపిణీ చేయబోతున్నాం. ఈ నిర్ణయంతో బస్తీ దవాఖాన్లలో మెడిసిన్ ఆర్టిఫిషియల్ కొరతకు చెక్ పెడుతున్నాం… అని మంత్రి వివ‌రించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img