స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు
జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేక జీవో ఆధారంగా రేవంత్ సర్కారు నిర్ణయించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సోమవారం ఉదయం నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రత్యేక జీవో జారీ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు రూట్ క్లియర్ అయినట్లుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.



