నర్సంపేట మున్సిపాలిటీకి 39 కోట్ల నిధులు మంజూరు
– ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
కాకతీయ, నర్సంపేట: మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 39 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు రేవంత్ రెడ్డిని కలసి నర్సంపేట మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కావాలని కోరగా ఇటీవల పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణానికి 20 కోట్లు విడుదల చేయగా, మరో 39 కోట్ల నిధులను ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రాంతాలతో పాటుగా 1 నుండి 9 వ వార్డుల్లో డైనేజి నిర్మాణాలకు ఇట్టి నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


