కాకతీయ, బయ్యారం: మండలంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలనే జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆదేశాల మేరకు శనివారం ఎస్సై తిరుపతి తమ సిబ్బందితో జగ్గు తండా సమీపంలో వాహన తనిఖీలు చేస్తూ ఐదుగురు వ్యక్తులు చెక్ చేశారు. వారి వద్ద గాంజా పట్టుబడినట్లు గార్ల, బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ భూక్యా రవికుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నలుగురు వ్యక్తులు, ఓ బాలుడు(గుండ్ల సాయి, మక్కల నవీన్ , రేపల్లె సాయి, జనుగు దిలీప్) పై కేసు నమోదు చేసి, వారిని విచారణ చేసి 300 గ్రాముల గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి మూడు ద్విచక్రవాహనాలు, మూడు ఫోన్లు స్వాధీనపరచుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తిరుపతి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


