epaper
Monday, March 9, 2026
epaper

25 శాతం ఫెనాల్టీ మాఫీ చేయాలి

25 శాతం ఫెనాల్టీ మాఫీ చేయాలి

12 శాతం వడ్డీని ర‌ద్దు చేయాలి

ములుగు జిల్లాలో రైస్ మిల్లర్ల ఆందోళన

కలెక్టర్‌కు వినతిపత్రం

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం రైస్ మిల్లర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనను వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తమ సమస్యలను వివరిస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మిల్లర్లు మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతులకు, ప్రభుత్వానికి మధ్య కీలకమైన వారధిగా రైస్ మిల్ పరిశ్రమ పనిచేస్తోందని తెలిపారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ పరిశ్రమ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, అధిక విద్యుత్ చార్జీలు, గోదాముల కొరత, ధాన్యం నాణ్యత సమస్యలు వంటి అనేక కారణాల వల్ల రైస్ మిల్లర్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా 2019-20 కరోనా సమయంలో ప్రభుత్వం భారీగా ధాన్యం కేటాయించడంతో చాలా రైస్ మిల్లులు సమయానికి సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యాన్ని ప్రభుత్వానికి అందించలేకపోయాయని తెలిపారు. హమాలీల కొరత, గోదాముల లేమి కారణంగా ధాన్యం ఎక్కువకాలం నిల్వ ఉండి నాణ్యత దెబ్బతిన్నదని, దీంతో మిల్లర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. అప్పట్లో ధాన్యం మద్దతు ధర రూ.1835 ఉండగా ప్రస్తుతం 2025-26 నాటికి అది రూ.2389కు పెరిగిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో డిఫాల్ట్‌గా గుర్తించబడిన మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం అందించాలంటే అదనంగా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పారు. దీనికి తోడు ప్రభుత్వం విధించిన 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ మిల్లర్లపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతోందని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఒక డిఫాల్ట్ రైస్ మిల్ కుటుంబానికి చెందిన మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనను ప్రస్తావిస్తూ, ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మిల్లర్లు విజ్ఞప్తి చేశారు. డిఫాల్ట్ మిల్లర్లపై విధించిన 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీని మాఫీ చేయాలని, ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని నాలుగు వాయిదాలలో చెల్లించే విధంగా అవకాశం కల్పించాలని అసోసియేషన్ కోరింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల గుడి వద్ద యువకులపై దాడి..

కొమ్మాల గుడి వద్ద యువకులపై దాడి.. నిందితుడిపై కేసు నమోదు కాకతీయ,గీసుగొండ:కొమ్మాల గుడి...

పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు

పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు శంక‌రా నేత్ర వైద్య‌శాల‌, రుద్ర ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో...

ఆరోగ్యం కోసమే 5 కే రన్

ఆరోగ్యం కోసమే 5 కే రన్ ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే అభివృద్ధి నగర మేయర్...

విన్నపాలు విడిచి

విన్నపాలు విడిచి పన్నుల వేట! వెలవెలబోయిన జీడబ్ల్యూఎంసీ గ్రీవెన్స్ .. పూర్తిస్థాయిలో హాజరుకాని అధికారులు ఆఫీస‌ర్ల...

వేం నరేందర్‌రెడ్డిని కలిసిన బొమ్మినేని

వేం నరేందర్‌రెడ్డిని కలిసిన బొమ్మినేని కాకతీయ, వరంగల్ : రాజ్యసభకు ఎంపికైన వేం...

బీజేపీతోనే నగరాభివృద్ధి

బీజేపీతోనే నగరాభివృద్ధి వరంగల్ అభివృద్ధిపై కేంద్రం నజర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌కి నిధులు కేటాయించడం...

గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిర‌స‌న‌

గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిర‌స‌న‌ కాకతీయ, నర్సంపేట టౌన్: కేంద్ర ప్రభుత్వం...

ఇసుక ర్యాంప్ డీల్‌లో ఎస్సైపై లంచం ఆరోపణలు

ఇసుక ర్యాంప్ డీల్‌లో ఎస్సైపై లంచం ఆరోపణలు ఒక లక్ష రూపాయలు డిమాండ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img