కాకతీయ, హనుమకొండ : ఐనవోలు మండలం చింతకుంట క్రాస్ రోడ్ వద్ద మామునూరు ఏసీపీ వెంకటేష్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రగ్స్ రాకెట్ నిరోధక చర్యలో భాగంగా ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 214.370 కిలోల గంజాయి పట్టుకున్నారు. పోలీసులు మహారాష్ట్ర నుంచి వచ్చిన శివసింగ్ డొంగర్ ను అరెస్ట్ చేసి, రూ.1,07,18,500 విలువైన గంజాయి, 3 సెల్‌ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.


