epaper
Thursday, January 15, 2026
epaper

రష్యా సైన్యంలో 202 మంది భారతీయులు!

రష్యా సైన్యంలో 202 మంది భారతీయులు!
ఉక్రెయిన్ యుద్ధంలో 26 మంది మృతి
ఏడుగురు గల్లంతు… 50 మంది విడుదల కోసం ప్రయత్నాలు
119 మందిని స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్రం
విదేశాంగ శాఖ వెల్లడి

కాకతీయ, నేషనల్ డెస్క్ : రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత ఘోరమైన యుద్ధంగా భావిస్తున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 202 మంది భారతీయులు రష్యన్ సాయుధ దళాలలోకి నియమించబడ్డారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 26 మంది భారతీయులు మరణించగా, మరో ఏడుగురు గల్లంతైనట్లు రష్యా అధికారులు నివేదించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వివరాలను ఎంపీలు సాకేత్ గోఖలే, రణదీప్ సింగ్ సుర్జేవాలా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పార్లమెంటులో వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన సమిష్టి దౌత్య ప్రయత్నాల ఫలితంగా ఇప్పటివరకు 119 మంది భారతీయులను ముందస్తుగా విడుదల చేయించగలిగామని, మిగిలిన 50 మంది భారతీయుల విడుదల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతంలో మరణించిన ఇద్దరు భారతీయుల మృతదేహాలు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న మరుసటి రోజైన డిసెంబర్ 17న ఈ సమాధానం ఇవ్వడం గమనార్హం.

యుద్ధ ప్రాంతాలకు వెళ్లొద్దన్న హెచ్చరిక
భారతీయులను ప్రలోభపెట్టి లేదా మోసపూరిత మార్గాల్లో రష్యా సైన్యంలో చేర్చి యుద్ధరంగానికి పంపుతున్నట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లోనే రష్యా–ఉక్రెయిన్ వివాదానికి దూరంగా ఉండాలని భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. జనవరిలో కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం, అప్పటివరకు కనీసం 12 మంది భారతీయులు మృతి చెందగా, 16 మంది గల్లంతయ్యారు. ఆగస్టు 2024లో రష్యన్ సాయుధ దళాలలో పనిచేస్తున్న ఎనిమిది మంది భారతీయులు మరణించినట్లు కేంద్రం తెలిపింది.

ఫిబ్రవరి 2022 నుంచి యుద్ధం

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఫిబ్రవరి 2022లో ప్రారంభమైంది. ఉక్రెయిన్ నాటో (NATO)లో చేరేందుకు ప్రయత్నించడమే ఈ యుద్ధానికి కారణమని రష్యా పేర్కొంటూ తన పొరుగుదేశంపై దాడికి దిగింది.
అక్టోబర్‌లో గుజరాత్‌కు చెందిన మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ కేవలం మూడు రోజుల పాటు ఫ్రంట్‌లైన్‌లో ఉన్న తర్వాత ఉక్రెయిన్ దళాలకు లొంగిపోయినట్లు నివేదికలు వెలువడ్డాయి. స్టడీ వీసాపై రష్యాకు వెళ్లిన అతడిని మాదకద్రవ్యాల ఆరోపణలపై అరెస్టు చేసి ఏడేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. జైలు శిక్ష అనుభవించేందుకు ఇష్టపడక, “ప్రత్యేక సైనిక ఆపరేషన్”లో పాల్గొనే ఒప్పందంపై అతడు సంతకం చేసినట్లు వెల్లడైంది. ఇటీవలి మరణాల్లో రాజస్థాన్‌కు చెందిన 22 ఏళ్ల అజయ్ గొడారా కూడా ఉన్నారు. విద్యార్థి వీసాపై రష్యాకు వెళ్లిన అతడిని బలవంతంగా సైన్యంలో చేర్చారని, సెప్టెంబర్ 2025లో నెట్స్క్‌లోని సెలిడోవ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో అతడు మరణించినట్లు సమాచారం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img