20 క్వింటాల నల్ల బెల్లం 50 కేజీల పటిక పట్టివేత
బొలెరో ట్రాలీ సీజ్, నలుగురిపై కేసు నమోదు
చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే సహించేది లేదు
ఎస్సై చిర్ర రమేష్ బాబు
కాకతీయ, నెల్లికుదురు : చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే ఎంతటి వారనైనా సహించేది లేదని ఎస్సై చిర్ర రమేష్ బాబు అన్నారు. ఎస్సై వివరాలు తెలుపుతూ బుధవారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మండలంలోని నైనాల క్రాస్ వద్దకు వెళ్లేసరికి అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల నల్లబెల్లం, ఒక్క బస్తా పటిక , 5 లీటర్ల గుడుంబా తరలిస్తున్న బొలెరో ట్రాలీ పట్టుకొని అందులో ఉన్న వ్యక్తులను పట్టుకొని వివరాలు తెలుసుకోగా 1. మహబూబాబాద్ మున్సిపాలిటీ గ్రామం ఏటిగడ్డ తండా కు చెందిన బానోత్ కిరణ్, 2. గూడూరు గ్రామం అలకుంట్ల అనిల్ గా చెప్పగా వారి మీద వారితో పాటు ఉండి పారిపోయిన 3. ఆవులేగా తండాకు చెందిన గూగులోత నరేష్, 4. బంజర గ్రామానికి చెందిన బానోత్ సాయి కిరణ్ అను వ్యక్తుల మీద కేసు నమోదు చేశామని పట్టుకున్న వాటి విలువ రెండు లక్షల ఏడు వేలు ఉంటుందని, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్సై అన్నారు.


