epaper
Monday, March 2, 2026
epaper

20 మంది మావోయిస్టులు మృతి

20 మంది మావోయిస్టులు మృతి

ద‌ద్ద‌రిల్లిన దండ‌కార‌ణ్యం
బీజాపూర్​లో మరోసారి భారీ ఎదురుకాల్పులు
మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భీక‌ర ఎన్‌కౌంట‌ర్‌
న‌క్స‌ల్స్ ఏరివేతే ల‌క్ష్యంగా రెండు రోజులుగా ఆప‌రేష‌న్
మృతుల్లో పీఎల్‌జీఏ 2 క‌మాండ‌ర్ వెల్ల మోడియం ?
మావోయిస్టుల మృతదేహాలతోపాటు
పెద్దఎత్తున ఆయుధ, పేలుడు సామగ్రి స్వాధీనం
మావోయిస్టు పార్టీకి వ‌రుస ఎదురుదెబ్బ‌లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కొనసాగుతున్న ఎన్‌కౌంట‌ర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బుధవారం ప్రారంభమైన భారీస్థాయి మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉందని పోలీసులు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు మొత్తం 19 మంది మావోయిస్టులు ఈ ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. భద్రతా దళాలకూ భారీ నష్టం సంభవించింది. ముగ్గురు డీఆర్‌జీ (డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌) జవాన్లు చనిపోగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో మావోయిస్టుల మృతదేహాలతోపాటు పెద్దఎత్తున ఆయుధ, పేలుడు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

పార్టీకి కోలుకోలేని దెబ్బ

మరోవైపు ఈ సంవత్సరంలోనే మావోయిస్టు పార్టీ ఛీఫ్ నంబాల కేశ‌వ‌రావు అలియాస్ బ‌స‌వ‌రాజ్‌తోపాటు కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, బాలకృష్ణ, గణేశ్​, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి, హిడ్మా లాంటివారు మృతి చెందడం అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లొంగిపోవడం చంద్రన్న, బండి ప్రకాశ్​ అనారోగ్య కారణాలతో సాయుధమార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవడం లాంటి ఘటనలు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారాయి. దీంతో నాలుగున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన మావోయిస్టు (అప్పటి పీపుల్స్ వార్) ఉద్యమం నేడు తీవ్ర ఒడిదొడుకులకు గురవుతోంది. ఆపరేష్ కగార్ నేపథ్యంలో వరుస ఎన్​కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతోంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో అనేకమంది పార్టీ అగ్రనేతలే ఉద్యమాన్ని వీడుతున్నారు. దండకారణ్యంలో మనలేని పరిస్థితుల్లో ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. పార్టీలో కీలకంగా ఉన్న మరికొందరు సైతం ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రణాళికలను రూపొందించుకున్నట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా మావోయిస్టు పార్టీకి ఎదురవుతున్న గడ్డు పరిస్థితుల నేపథ్యంలో ఉద్యమంలో పురోగమించే అవకాశం లేదని గ్రహించిన నేపథ్యంలోనే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

జనవరి 1న ఒకేసారి లొంగిపోతామని లేఖ

కొద్ది రోజుల క్రితమే మావోయిస్టులు ఊహించని విధంగా కీలక ప్రకటన చేశారు. మహారాష్ట్ర-మధ్యప్రదేశ్‌-ఛత్తీస్‌గఢ్‌ జోన్‌ ప్రతినిధి అనంత్‌ అనే పేరుతో వారు ఓ లేఖను విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 1న ఆయుధాలను విడిచి లొంగిపోతామని అందులో పేర్కొన్నారు. ఒక్కొక్కరు కాకుండా అంతా ఒకేసారి లొంగిపోతామని తెలిపారు. మావోయిస్టు అగ్రనేతలైన మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లొంగుబాటు, గెరిల్లా వ్యూహకర్త హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీ మరింత బలహీనమైందని పేర్కొన్నారు. మిగతావారు కూడా లొంగిపోవాలన్న కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ లేఖలో వివరించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించి, భద్రతాబలగాల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని మావోలు కోరారు. జోన్‌లో ఎలాంటి అరెస్టులు కానీ ఎన్‌కౌంటర్‌లు, అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని వారు తమ లేఖలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈనేప‌థ్యంలో తాజాగా ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంట‌ర్ జ‌ర‌గ‌డం.. 19 మంది మావోయిస్టులు మ‌ర‌ణించ‌డం గ‌మ‌నార్హం.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img