ఏటూరునాగారంలో 20 లీటర్ల గుడుంబా పట్టివేత.
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రోయ్యూరు గ్రామంలో అక్రమంగా గుడుంబా విక్రయాలపై పోలీసులు దాడి చేసి 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. నమ్మదగిన సమాచారంపై ఎస్‌ఐ రాజ్‌కుమార్ నేతృత్వంలో పోలీసులు రోయ్యూరు గ్రామంలో తనిఖీలు నిర్వహించగా, దొంగ్రీ రాజశేఖర్ అనే వ్యక్తి గుడుంబా అమ్ముతున్నట్లు గుర్తించి, ఘటనాస్థలంలో నుంచే 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం తయారీ, విక్రయం పై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తామని ఎస్‌ఐ రాజ్‌కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య, కానిస్టేబుల్ హరీష్ తదితరులు పాల్గొన్నారు


