epaper
Monday, March 2, 2026
epaper

136 మొబైల్‌ ఫోన్లు రికవరీ

136 మొబైల్‌ ఫోన్లు రికవరీ
బాధితులకు అంద‌జేసిన జ‌గిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్‌

కాకతీయ, జగిత్యాల : ఇటీవ‌లి కాలంలో జగిత్యాల జిల్లాలో మిస్సింగ్‌, దొంగ‌లించ‌బ‌డిన ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మొత్తం 136 మొబైల్‌ ఫోన్లను ఫిర్యాదుదారుల‌కు సోమ‌వారం అంద‌జేశారు. స్వాధీనం చేసిన ఫోన్ల మార్కెట్‌ విలువ సుమారు 28 లక్షల రూపాయలు ఉంటుంద‌ని జ‌గిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్ల‌డించారు. ఈసంద‌ర్భంగా సోమ‌వారం ఎస్పీ కార్యాల‌యంలో విలేక‌రుల స‌మావేశంలో అశోక్‌కుమార్ మాట్లాడుతూ మొబైల్‌ పోయిన వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం తప్పనిసరి అని చెప్పారు. సీఐఈఆర్‌ (కేంద్ర పరికరాల గుర్తింపు నమోదు) పోర్టల్‌లో వివరాలు నమోదు చేస్తే ఫోన్‌ రికవరీ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో 3.5 కోట్లకు పైగా విలువ గల 1548 మొబైల్‌ ఫోన్లను ట్రేస్‌ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. మొబైల్‌ పోయినప్పుడు నిర్లక్ష్యం చేస్తే, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అందువల్ల అనుమానాస్పద కాల్స్‌, సందేశాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు. దొంగిలించిన ఫోన్లు నేరాలకు కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నందున తప్పనిసరిగా సీఐఈఆర్‌లో నమోదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సెకండ్‌హ్యాండ్‌ ఫోన్లు కొనేటప్పుడు ఆ ఫోన్‌ ఐఎంఈఐ నెంబర్‌ సీఐఈఆర్‌లో చెక్‌ చేయాలని సూచించారు. మొబైల్ ఫోన్ల‌ రికవరీలో కీలకపాత్ర పోషించిన ఐటీ కోర్‌ ఇన్స్పెక్టర్‌ రఫీక్ ఖాన్, సీఐఈఆర్‌ బృందంలోని కృష్ణ, హెడ్‌ కానిస్టేబుల్‌ మహ్మూద్‌, కానిస్టేబుల్స్‌ అజర్‌, యాకూబ్‌లను ఎస్పీ అభినందించారు. స్వాధీనం చేసిన ఫోన్లు అందుకున్న బాధితులు పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img