జూదం ఆడుతున్న 12 మంది అరెస్ట్..
రూ.2.39 లక్షల నగదు, 12 మొబైల్ ఫోన్లు, పేకాట కార్డులు స్వాధీనం..
కాకతీయ, హనుమకొండ : హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పేకాట ఆడుతున్న 12 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు హనుమకొండలోని రెడ్డి కాలనీలో చోప్పదండి రంజిత్ నివాసంలో పేకాట జరుగుతున్నట్లు గుర్తించిన టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 12 మందిని పట్టుకుని వారి వద్ద నుండి రూ.2,39,660 నగదు, 12 మొబైల్ ఫోన్లు, పేకాట కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దాడి అనంతరం స్వాధీనం చేసుకున్న వస్తువులు, నిందితులను హనుమకొండ పోలీస్ స్టేషన్కు అప్పగించి, తదుపరి చట్టపరమైన చర్యల కోసం పంపించారు. అరెస్టయిన నిందితులు.. గుంటపడి ప్రదీప్, జంగోన్ మల్లేష్, చోప్పదండి రంజిత్, అనిశెట్టి మహేష్, అంబటి రాజు, అలువాల ప్రవీణ్ కుమార్, తేజావత్ సుమన్, వెలదండి పున్నంచందర్, చింతకుల ప్రభాకర్, దాది వీరేశం, బొంత రాజు, గొండ్ల దేవేందర్. అక్రమ జూదం వంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. ఈ ఆపరేషన్లో ఏసీపీ ఏ. మధుసూదన్, ఇన్స్పెక్టర్లు ఎస్. రాజు, ఓ. భాను ప్రకాష్ (ఆర్ఎస్ఐ)తో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు


