కాకతీయ, నేషనల్ డెస్క్: చైనాలో నిర్మిస్తున్న ఓ భారీ రైల్వే వంతెన నిర్మాణంలోనే ఉండగానే కూలిపోయింది. యెల్లో రివర్ పై శుక్రవారం జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి ఆచూకీ లభించలేదు. సిచువాన్-కింగ్ హై రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సైట్లో ప్రాజెక్టు మేనేజర్ తో సహా మొత్తం 16 మంది ఉన్నట్లు పీపుల్స్ డైలీ తెలిపింది. స్టీల్ కేబుల్ తెగిపోవడమే ఈ ఘటనకు కారణమని ప్రభుత్వ వార్త సంస్థ జిన్హువా వెల్లడించింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
చైనాలో రెండో అతిపెద్ద నది అయిన యెల్లో రివర్ పై నిర్మిస్తున్న తొలి రైల్వే స్టీల్ ట్రస్ బ్రిడ్జి ఇదే. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద స్పాన్ డబుల్ ట్రాక్ స్టీల్ ట్రస్ ఆర్చ్ బ్రిడ్జిగాను ఇది గుర్తింపు పొందింది. వంతెనకు చెందిన ప్రధాన ఆర్చ్ భాగం ఒక్కసారి కూలిపోయిన ద్రుశ్యాలను చైనా సెంట్రల్ టెలివిజన్ ప్రసారం చేసింది. సమాచారం తెలుసుకున్న వెంటనే వందలాది మంది సహాయ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
?? — CHINA: A bridge under construction on a railway collapsed yesterday in Qinghai Province in China after a cable snapped, killing 7 and leaving 9 missing. pic.twitter.com/MVTn3W9Bwo
— Belaaz News (@TheBelaaz) August 22, 2025


