108 అంబులెన్స్ తనిఖీ
కాకతీయ, పెద్దవంగర :మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలానికి సంబంధించిన 108 అంబులెన్స్ వాహనాన్ని మంగళవారం భద్రాద్రికొత్తగూడ,ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల క్లస్టర్ ఇంచార్జి షేక్ నాజీరుద్దీన్, మహబూబాబాద్ జిల్లా ఇంచార్జి బత్తాని మహేష్ లు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అత్యవసర సమయంలో వినియోగించే పరికరాల పనితీరును, సంబంధించిన రికార్డులను పరిశీలించి సిబ్బందికి వారు పలు సూచనలు, సలహాలు చేశారు. రోడ్డు యాక్సిడెంట్లు, గర్భిణులు, పాము కాటు వంటి ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనూ 108 అంబులెన్సును మండల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. వారి వెంట 108.సిబ్బంది గంజి నవీన్ రెడ్డి,బానోత్ వనజ తదితరులు ఉన్నారు.


