epaper
Monday, March 2, 2026
epaper

హోంగార్డుల‌కు జీతాలు చెల్లించ‌క‌పోవ‌డం సిగ్గుచేటు

హోంగార్డుల‌కు జీతాలు చెల్లించ‌క‌పోవ‌డం సిగ్గుచేటు
ప్రతి నెలా ఇదే తీరు.. పట్టించుకునే వారే లేరు:మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

కాక‌తీయ‌, హైదరాబాద్ : నెల ముగింపున‌కు వ‌స్తున్నా రాష్ట్రంలోని హోంగార్డుల‌కు ఇంకా జీతాలు చెల్లించ‌క‌పోవ‌డం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు విమర్శించారు.. రాష్ట్రంలోని హోంగార్డు సోదరుల ఆవేదన విన‌ప‌డ‌డం లేదా అని సోష‌ల్ మీడియా ఎక్స్(ట్విట్ట‌ర్‌) వేదిక‌గా సీఎం రేవంత్‌రెడ్డిని ఆయ‌న ప్ర‌శ్నించారు. నెల మొదలై 22 రోజులు గడుస్తున్నా హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అన్నారు.చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు, చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. భద్రాది కొత్తగూడెం, మెదక్, మహబూబ్ నగర్, వనపర్తి, జగిత్యాల, వరంగల్, రామగుండం, వికారాబాద్ జిల్లాల్లో పని చేస్తున్న హోంగార్డుల‌కు జీతాలు రాలేద‌న్న అంశాన్ని ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు ప్ర‌స్తావించారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చెయ్యాల్సిన దుస్థితి నెల‌కొంద‌న్నారు. ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంక్‌ అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్న పరిస్థితి ఎదుర్కొంటున్న‌ట్లు చెప్పారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేర‌న్నారు. మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరికి ఏం సమాధానం చెబుతార‌ని ప్ర‌శ్నించారు. మీరు మంత్రిగా ఉన్న హోంశాఖలోనే ఇలాంటి దుర్బర పరిస్థితి త‌లెత్తితే వారి ఆవేద‌న ఇంకెవ‌రికి చెప్పుకోవాల‌న్నారు. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు, మాటల్లో ఫేకుడు, ఢిల్లీకి వెళ్లి జోకుడు ఇదేనా మీకు తెలిసిందన్నారు. వెంటనే హోంగార్డులకు వేతనాలు చెల్లించాలని, ప్రతి నెలా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయ‌న‌ డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత – నిమ్స్‌లో చికిత్స

బిగ్ బ్రేకింగ్‌..! మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఇటీవల రాజకీయ పరిణామాలతో...

ఖమ్మం నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం – విద్యార్థిపై దాడి

నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం మత్తులో ఇద్దరు విద్యార్థుల దాడి… ఇంటర్ విద్యార్థి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img