కాంగ్రెస్ ప్రజాపాలనలో పరుగులు పెడుతున్న అభివృద్ది, సంక్షేమం
పీసీసీ అధికార ప్రతి నిధి పల్లె రాంచందర్ గౌడ్

కాకతీయ, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంది స్తుందని టిపిసిసి అధికార ప్రతి నిధి పల్లె రాంచందర్ గౌడ్ తెలిపారు మంగళవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ సన్న బియ్యం తో దేశంలోనే రికార్డ్ సాధించా మని ఆయన పేర్కొన్నారు,రేషన్ కార్డు ల ద్వారా రాష్ట్రం లోని 93లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. పేదలు, ఆర్తి కంగా వెనుక బడిన మధ్య తరగతి వర్గాల అభి వృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు పల్లె వివరించారు. 18నెలల ప్రభుత్వ కాలంలో ఓ వైపు అభి వృద్ది, మరో వైపు సంక్షేమం జోడేడ్ల లా పరుగులు పెడుతుందని అన్నారు. రైతులు పేదల, కంటే తమకు ఏది ముఖ్యం కాదని చెప్పారు.రైతు బందు పతకం ద్వారా పెట్టుబడి సాయం కింద కేవలం 9రోజుల్లో 9వేల కోట్లు రైతుల ఖాతాలో జమచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు రాష్ట్రంలో రహదారుల అభి వృద్ధికి విద్యా వైద్యం కోసం పాటు పడుతున్నామని రాంచందర్ గౌడ్ వివరించారు. బీసీ రిజర్వేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కుల గణ న నిర్వహించి న విషయాలు అనేకం ప్రభుత్వ పాలనలో ప్రజలకు అందుతున్నాయని చెప్పారు త్వరలో జరిగే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దే విజయమనే దీమాను పల్లె రాంచందర్ గౌడ్ వ్యక్తం చేశారు.


