ఈ విద్యా సంస్థల్లో ప్రవేశాలు తీసుకోవద్దు..
ఎంబీబీఎస్ విద్యార్థులకు ఎన్ఎంసీ హెచ్చరిక

కాకతీయ, న్యూఢిల్లీ, : బెలిజ్‌లోని సెంట్రల్ అమెరికా ఈశాన్య తీరంలో ఉన్న వైద్య సంస్థల్లో అలాగే ఉజ్బెకిస్తాన్‌లోని ఒక వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవద్దని నేషనల్ మెడికల్ కమిషన్ హెచ్చరించింది. బెలిజ్‌లోని సెంట్రల్ అమెరికన్ హెల్త్ అండ్ సైన్సెస్ యూనివర్సిటీ, కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ, వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్‌తో సహా మూడు వైద్య సంస్థలలో అడ్మిషన్ తీసుకోవద్దని ఎన్ఎంసీ ఒక నోటీసులో భారతీయ విద్యార్థులకు సూచించింది. భారతీయ వైద్య విద్య ప్రమాణాలను పాటించకపోవడం, క్యాంపస్ మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం, నాణ్యత లేని క్లినికల్ శిక్షణ సౌకర్యాలు, భారతీయ విద్యార్థులపై వేధింపులు వంటి ఆందోళనల నేపథ్యంలో ఎన్ఎంసీ ఈ హెచ్చరికను జారీ చేసింది.


