11 వేల యూట్యూబ్ ఛానల్స్‌ని తొలగించిన గూగుల్

కాకతీయ, న్యూఢిల్లీ : దిగ్గజ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాలకు సంబంధించి అసత్య ప్రచారాలు చేస్తున్న 11 వేల యూట్యూబ్ ఛానల్స్‌ని గూగుల్ తొలగించింది. ఇందులో ప్రధానంగా చైనా, రష్యాకు చెందినవే టాప్ లిస్టులో ఉన్నాయి. చైనాకు చెందిన 7,700 ఛానెల్స్ భారత్‌లో రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీకి సంబంధించి.. ప్రచారాలు చేస్తున్నాయని.. ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రశంసిస్తూ.. పలు వీడియోలు చేస్తున్నాయని ఆరోపణల నేపథ్యంలో వాటిని తొలగించింది.రష్యాకు చెందిన 2వేలకు పైగా యూట్యూబ్ ఛానెల్స్ ఇతర వెబ్సైట్లను తొలగించినట్లు గూగుల్ వెల్లడించింది. ఉక్రెయిన్, నాటోలను విమర్శిస్తూ.. రష్యాకు మద్దతిచ్చేలా వీటిలో సమాచారం ఉందని పేర్కొంది. ఈ రెండు దేశాలతో పాటు ఇరాన్, టర్కీ, ఇజ్రాయెల్, రొమేనియా, అజర్బైజాన్, ఘనాకు చెందిన యూట్యూబ్ ఛానళ్లను గూగుల్ తొలగించింది. ఆయా దేశాలకు చెందిన ఛానళ్లు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా.. మత విద్వేశాలను రెచ్చగొట్టేలా అసత్యాలు ప్రసారం చేస్తున్నందు వల్ల ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.


