బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు సాధ్యమే
మరోసారి తన నిజస్వరూపం బయటపెట్టుకున్నా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్

కాకతీయ, హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు సాధ్యమే అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మరోసారి తన నిజస్వరూపం బయట పెట్టుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. రామచందర్ రావు బీసీల రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ లో చేర్చడం అసాధ్యం అంటున్నారని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో రిజర్వేషన్లను పెంచారని తెలియజేశారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీలు రాజీనామా చేస్తే బిసి రిజర్వేషన్లన్లు ఎందుకు అమలు కావో చూస్తాం అని బిసి రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలి అని కోరారు. బిసి వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం అని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.


