సంక్షేమాన్ని కొనసాగిస్తాం
అవరోధాలను అదిగమిస్తాం
అభివృద్ధి చేసి చూపిస్తాం
ఈ ప్రభుత్వానికి ప్రజా మద్దతు
ప్రజాపాలనలో ఆరుగ్యారంటీలనుఅమలు చేసి తీరుతాం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కాకతీయ, భూపాలపల్లి : గత ప్రభుత్వ తప్పిదాలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస సోమవారం గణపురం మండలం, చెల్పూర్ లో రూ. 5.50 కోట్లు కెటిపిపి సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న నూతన బస్ స్టాండ్ నిర్మాణానికి రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే, ఆర్టీసీ అధికారులతో కలిసి ప్రారంభిస్తూ జిల్లాలోని గోరి కొత్తపల్లిలో నూతన పోలీస్ స్టేషన్, చెల్పూర్లో బస్టాండ్ నిర్మాణం కోసం, భూపాలపల్లి యువత కోసం నైపుణ్య శిక్షణ కేంద్రం, ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారుల ఇల్లు నిర్మాణం లతో పాటు పలు అభివృద్ధి, నిర్మాణాల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేపట్టారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన గత ప్రభుత్వ తప్పిదాలకు ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి రాష్ట్ర సంక్షేమం ప్రజల అభివృద్ధి కోసం మనం చేపట్టే మంచి కార్యక్రమాలకు ఎపుడు దేవుని ఆశీస్సులు ఉంటాయని, అన్ని వేళలా సహకరిస్తారని తెలిపారు. ఈ ప్రాంతం సస్య శ్యామలం గా ఉండాలని ప్రభుత్వం ఎల్లపుడు ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. దివంగత నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మహిళలను లక్షాధికారులను చేయాలని సంకల్పించారని, ఈ ప్రజా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కోరిక అని, మహిళలకు మహిళా శక్తి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆర్ టి సి బస్సులు, పెట్రోల్ బంక్ లు , సోలార్ పవర్ కేంద్రాలు, దాన్యం సేకరణ కేంద్రాలు, మహిళా క్యాంటీన్లు, అమ్మ ఆదర్శ పాఠశాలలు లాంటి కార్యక్రమాలు ఆడబిడ్డలను ముందు పెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం చేసిన 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్న 10 నెలలో 21 వేల కోట్లు రుణమాఫీ చేశామని, రైతు భరోసా 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని తెలుపుతూ ఇంకా రాబోయే రోజుల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు.సంవత్సరం కాలం నుండి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రెండు కళ్ళుగా భావించి నడిపిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గత ప్రభుత్వ యాయంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు కొరకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగారని అన్ని అర్హతలు ఉన్నప్పటికీ నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు.
భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ గోరి కొత్తపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నియోజక వర్గంలో భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలు రాక ఇబ్బందులు పడుతున్నారని వారందరికీ పట్టాలు మంజూరు చేయాలని మాత్రులను ఆయన కోరారు. భూ భారతి చట్టంతో 12 సంవత్సరాలు మోకాపై ఉంటే పట్టాలు జారీ చేయు విధము ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అనునిత్యం పని చేస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. జిల్లాకు బై పాస్ రోడ్డు, మైనింగ్ కళాశాల, పాలి టెక్నీక్ కళాశాల, డిబిఎం 38 కాలువకు రూ.320 కోట్లు మంజూరు చేయాలని కోరారు. దీని వల్ల 44700 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్టీసీ ఎడ్ సలోమం, ఆర్ ఎం విజయ భాను, డిఎం ఇందు,
సింగిల్ విండో చైర్మన్లు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు కిష్టప్ప, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


