రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు యాకేష్
కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థి అజ్మీర యాకేష్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని ఆ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ తాళ్ళ ప్రణయ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల వరంగల్ ఓసిటీ గ్రౌండ్ లో నిర్వహించిన అండర్ 14 ఎస్జిఎఫ్ వాలీబాల్ సెలక్షన్ లోనూ ఎంపికయ్యాడని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా తరపున 26 నుండి 28 వరకు పెద్దపల్లి జిల్లా నంది మేడారంలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడల్లో యాకేష్ పాల్గొంటారని తెలిపారు. విద్యార్థి రాష్ట్రస్థాయిలో ఎంపిక కావడంతో ఇనుగుర్తి ఎంఈఓ, జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు జే. రూపారాణి, పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని పీడీని అభినందించారు.


