వెంకటేశ్వర్లు మృతి బాధాకరం – కూనంనేని
ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సాంబశివరావు.
కాకతీయ, జూలూరుపాడు : గత కొన్ని నెలల నుండి బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతు కాకర్ల గ్రామానికి చెందిన సోబ్బని వెంకటేశ్వర్లు మరణించారు .విషయం తెలుసుకున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు కాకర్ల గ్రామంలో వెంకటేశ్వర్లు మృతదేహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ సోబ్బని వెంకటేశ్వర్లు తండ్రి సోబ్బని సూర్యం సిపిఐ పార్టీ లో చాలా కాలం నుండి పనిచేస్తున్నారని ఇలాంటి నిబద్ధతగల సూర్యం కుమారుడి అతి చిన్న వయసులో మరణించడం చాలా బాధాకరమని ఆయన అన్నారు వెంకటేశ్వర్లు కుటుంబానికి సిపిఐ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని వెంకటేశ్వర్లు భార్య పిల్లలను, తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని అధైర్య పడద్దని ధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు,మండల సహాయ కార్యదర్శి షేక్ నాగుల్ మీరా,ఎల్లంకి మధు,సిరిపురం వెంకటేశ్వర్లు,గుడిమెట్ల సీతయ్య,చిమట ముత్తయ్య, బెజవాడ సీతయ్య, తదితరులు పాల్గొన్నారు.


