epaper
Wednesday, January 28, 2026
epaper

అడవి పులకించె…సార‌ల‌మ్మ‌ గద్దెపై కొలువుదీరె!

అడవి పులకించె…సార‌ల‌మ్మ‌ గద్దెపై కొలువుదీరె!
కన్నెపల్లి నుంచి సారలమ్మ రాకతో తొలి ఘట్టం పూర్తి
పూనకాల హోరు… శివాలూగిన మేడారం

కాకతీయ, మేడారంబృందం : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 వైభవంగా ప్రారంభమైంది. జాతర తొలి రోజైన బుధవారం రాత్రి అడవిమాతల ఆగమనంతో మేడారం పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడాయి. అడవీ మార్గాలన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోగా, డోలు దరువులు, కొమ్ము బూరల నాదాల మధ్య అడవి పులకించిపోయింది.
కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ బుధవారం రాత్రి మేడారం గద్దెపై ప్రతిష్టితులయ్యారు. ఆమెతో పాటు కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు కూడా గద్దెలపై కొలువుదీరడంతో తొలి ఘట్టం విజయవంతంగా ముగిసింది. గిరిజన పూజారుల సంప్రదాయ పూజల మధ్య అమ్మవార్లను గద్దెలపై ప్రతిష్టించగా, భక్తుల జయజయధ్వానాలతో మేడారం మార్మోగింది.

 

పూనకాల పరవళ్లు… భక్తజన సంద్రంగా మారిన అరణ్యం
తల్లుల ఆగమనంతో శివసత్తుల పూనకాలు, గిరిజన నృత్యాలు, భక్తుల ఊగిసలాటలతో మేడారం ఆధ్యాత్మిక కాంతులతో నిండిపోయింది. జంపన్నవాగు పరిసరాల్లో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు. నాటుకోళ్లు, బెల్లం మొక్కులతో వనదేవతలకు భక్తులు తమ కృతజ్ఞతను చాటుతున్నారు.

భారీ బందోబస్తు…

నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహాజాతరకు సుమారు 1.5 కోట్ల మంది భక్తులు తరలివస్తారని అంచనా. దీనికి అనుగుణంగా ప్రభుత్వం భారీ బందోబస్తు, వైద్య, రవాణా ఏర్పాట్లు చేసింది. తొలి రోజు సారలమ్మ ఆగమనంతో జాతర ఉత్సాహంగా కొనసాగుతోంది. రేపు చిలుకలగుట్ట నుంచి ప్రధాన దేవత సమ్మక్క తల్లి గద్దెపైకి రానుండటంతో జాతర మరింత ఉద్ధృతంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అమ్మ‌వారిపేట జాత‌ర‌లో అగ్ని ప్రమాదం

అమ్మ‌వారిపేట జాత‌ర‌లో అగ్ని ప్రమాదం సారలమ్మను తీసుకొచ్చే సమయంలో ఘ‌ట‌న‌ కాకతీయ, వరంగల్ సిటీ...

అమ్మవారు అడిగిందా… అలిగిందా?

అమ్మవారు అడిగిందా… అలిగిందా? సారలమ్మ గద్దెకు చేరకముందే గేట్లు ఎందుకు తెరచారు? భద్రతా కారణాలా…...

న‌ల్ల‌బెల్లి మండ‌లంలోని మ‌ద్దిమేడారంలో

న‌ల్ల‌బెల్లి మండ‌లంలోని మ‌ద్దిమేడారంలో గద్దెలపైకి చేరుకున్న సారలమ్మ కాకతీయ. నల్లబెల్లి:మద్ది మేడారం జాతరలో భాగంగా...

బీఆర్ఎస్ ఫ‌స్ట్ లిస్ట్ రిలీజ్‌

బీఆర్ఎస్ ఫ‌స్ట్ లిస్ట్ రిలీజ్‌ 12 మంది అభ్యర్థుల పేర్లు ప్ర‌క‌ట‌న‌ వివ‌రాలు వెల్ల‌డించిన...

అడవి పులకించె…సార‌ల‌మ్మ ఆగ‌మానికి స్వాగ‌తం

అడవి పులకించె…సార‌ల‌మ్మ ఆగ‌మానికి స్వాగ‌తం కన్నెపల్లి నుంచి గ‌ద్ద‌ల వైపు సారలమ్మ రాక పూనకాల...

గద్దెల వైపు అమ్మవారి పయనం

గద్దెల వైపు అమ్మవారి పయనం గుడి ప్రాంగణానికి చేరుకున్న అమ్మవారు మరికొద్ది సమయంలో గద్దెలపైకి...

మరికొద్ది నిమిషాల్లో సారలమ్మ గద్దెపైకి…

మరికొద్ది నిమిషాల్లో సారలమ్మ గద్దెపైకి… – భక్తులకు వేగవంతమైన దర్శనం కాకతీయ, మేడారం బృందం...

విశ్వబ్రాహ్మణ యూత్‌కు నూతన నాయకత్వం

విశ్వబ్రాహ్మణ యూత్‌కు నూతన నాయకత్వం హనుమకొండ జిల్లా యూత్ అధ్యక్షుడిగా అమ్మోజు సురేష్ సంఘ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...
spot_img

Popular Categories

spot_imgspot_img