epaper
Saturday, January 24, 2026
epaper

రేషన్ డీలర్ల బియ్యం దందా

రేషన్ డీలర్ల బియ్యం దందా
లబ్ధిదారుల నుంచే నేరుగా కొనుగోళ్లు
గుట్టుచప్పుడు కాకుండా సీక్రెట్గా గోదాంలకు తరలింపు
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు
నిబంధనలను బేఖాతర్ చేస్తున్న డీలర్లు
డీలర్లే బియ్యం దందాకు కీలక సూత్రధారులుగా అనుమానాలు
డీలర్లపై కనిపించని తనిఖీలు
మామూల్ల మ‌త్తులో సంబంధిత శాఖ అధికారులు.

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : పేదల కడుపు నింపాల్సిన సన్నబియ్యం ఇప్పుడు కొందరు రేషన్ డీలర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వం పేదల కోసం పంపిణీ చేస్తున్న రేషన్ సన్నబియ్యం డీలర్ల అక్రమార్జనకు నెలనెల ఆదాయం తెచ్చిపెట్టే ప్రధాన వ్యాపారంగా మారింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా, అక్రమ కొనుగోళ్లపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా డీలర్లు మాత్రం నిబంధనలను బేఖాతర్ చేస్తూ దందాను నిర్భయంగా కొనసాగిస్తున్నారు. పంపిణీ చేయాల్సిన డీలర్లే ఒక చేత్తో పంపిణీ చేస్తూ మరో చేత్తో కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా సీక్రెట్ గోదాంలకు తరలించి అక్కడి నుంచి ఇతర మార్గాల ద్వారా బహిరంగ మార్కెట్‌కు మళ్లిస్తూ భారీ లాభాలు కొల్లగొడుతున్నారు. ఈ అక్రమ దందాలో నెలకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అటువంటి ఘటననే తాజాగా కాకతీయ నిఘా నేత్రానికి చిక్కింది.

అక్క‌డే ఇస్తాడు..అక్క‌డే కొంటాడు

కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్ ఓల్డ్ 33, న్యూ 42వ డివిజన్ పరిధిలోని రేషన్ షాపులో అక్రమ వ్యవహారం వెలుగుచూసింది. సన్నబియ్యం పంపిణీ చేయాల్సిన రేషన్ డీలరే ఒకవైపు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తూనే మరోవైపు అదే షాపులో లబ్ధిదారుల నుంచే తిరిగి కొనుగోలు చేస్తున్నాడు. కిలోకు రూ.12 చొప్పున నగదు నేరుగా లబ్ధిదారుల చేతికి అందజేస్తున్న దృశ్యాలను కాకతీయ నిఘా నేత్రం క్లిక్‌మనిపించింది. ఈ డీలర్ ప్రతి నెల రేషన్ బియ్యం పంపిణీ సమయంలో ఇదే విధానాన్ని కొనసాగిస్తూ లబ్ధిదారుల వద్ద నుంచి యథేచ్ఛగా బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా సేకరించిన బియ్యాన్ని తనకు సంబంధించిన వ్యక్తి ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ద్విచక్ర వాహనంపై రహస్యంగా తరలించి వేరే ప్రాంతంలోని ఒక స్థావరంలో నిల్వ ఉంచుతూ అనుకూల సమయం చూసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు స్థానికుల నుంచి తెలుస్తున్న గోప్య సమాచారం. ఈ విషయంపై కాకతీయ సంబంధిత అధికారులను సంప్రదించగా ఈ ఘటనపై చర్యలు చేపడతామని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు!

భగత్‌నగర్‌కే పరిమితం కాకుండా కరీంనగర్ జిల్లా అంతటా అనేక రేషన్ షాపుల్లో బియ్యం దందా బహిరంగంగానే కొనసాగుతోందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. పేదలకు పంపిణీ చేసిన సన్నబియ్యం లబ్ధిదారుల ఇళ్లకు చేరకముందే తిరిగి డీలర్ల చేతుల్లోకి చేరి వారికి భారీ లాభాలను తెచ్చిపెడుతున్నట్లు సమాచారం. రేషన్ బియ్యాన్ని తిరిగి కొనుగోలు చేయడం పూర్తిగా నిషిద్ధమన్న విషయం తెలిసినా నిబంధనలను తుంగలో తొక్కుతూ డీలర్లు దర్జాగా వ్యాపారం కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. లబ్ధిదారులను ప్రలోభపెట్టడం, ధర ఖరారు చేయడం, రహస్యంగా తరలించడం వరకు మొత్తం వ్యవహారం డీలర్ల చేతుల్లోనే సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంపిణీ బాధ్యత ఉన్నవారే ఈ అక్రమాలకు ప్రధాన పాత్రధారులుగా కొనసాగుతుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ దందాకు ప్రధాన కారణంగా అధికారుల తనిఖీలు కొరవడటం, స్టాక్ వెరిఫికేషన్ సరిగా జరగకపోవడమేనన్న కోణం ముందుకు వస్తోంది. పర్యవేక్షణ సడలడంతో డీలర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఈ అక్రమ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ముడుపుల మౌనమే డీలర్లకు అండ..?

రేషన్ షాపుల్లో డీలర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖ అధికారులు మౌనంగా ఉండటంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీలర్లు నిర్భయంగా అక్రమ దందా కొనసాగించడానికి కారణం శాఖలవారీగా నెలవారీ ముడుపులు అందుతుండటమేనన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకపోవడం, తనిఖీలు కనిపించకపోవడం, స్టాక్ వెరిఫికేషన్ కాగితాలకే పరిమితమవడం అన్నీ కలిసి డీలర్లకు రక్షణ కవచంగా మారుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు మేల్కొని అక్రమ దందాను కొనసాగిస్తున్న డీలర్లపై తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆర్టీసీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్

ఆర్టీసీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కాకతీయ, కరీంనగర్ : నేషనల్ రోడ్...

శాతవాహన వ‌ర్సిటీలో ఉద్యోగ మేళా

శాతవాహన వ‌ర్సిటీలో ఉద్యోగ మేళా కాకతీయ, కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయంలో జాతీయ...

రామగుండం న్టీపీసీ పరిధిలో అక్రమ ఇసుక నిల్వలపై తనిఖీ

రామగుండం న్టీపీసీ పరిధిలో అక్రమ ఇసుక నిల్వలపై తనిఖీ కాకతీయ, రామగుండం: న్టీపీసీ...

మానేరు ఒడ్డున కర్మకాండ నిలయం

మానేరు ఒడ్డున కర్మకాండ నిలయం రూ.15 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో భవన నిర్మాణం భూమి...

అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు

అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు హుస్నాబాద్ ఎక్సైజ్ సీఐ పవన్ హెచ్చ‌రిక‌ కోహెడలో...

యువ ప్రతిభకు టీజీఐసీ బలం

యువ ప్రతిభకు టీజీఐసీ బలం కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : యువతలోని...

ప్రజాసేవే లక్ష్యంగా కాంగ్రెస్‌లోకి డాక్టర్ సూరంజన్

ప్రజాసేవే లక్ష్యంగా కాంగ్రెస్‌లోకి డాక్టర్ సూరంజన్ నిరుపేదల వైద్యుడిగా గుర్తింపు పొందిన ప్రముఖుడి...

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి స్వచ్ఛ సర్వేక్షన్‌లో టాప్ ర్యాంక్ లక్ష్యం వివిధ స్కీముల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img