- త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ హేమంత్ వర్మ
కాకతీయ, ములుగు ప్రతినిధి : రామప్ప దేవాలయంలోని ప్రతీ శిల్పం కాకతీయుల కళా నైపుణ్యానికి అద్దం పడుతుందని త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ హేమంత్ వర్మ అభిప్రాయపడ్డారు.
వరంగల్ జిల్లా పర్యాటక క్షేత్రాలను సందర్శించే రెండు రోజుల పర్యటనలో భాగంగా హేమంత్ వర్మ దంపతులు శనివారం ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించి రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళా విశేషాలను కాకతీయుల శిల్ప వైభవాన్ని వివరించారు.
ఈ సందర్భంగా చైర్మన్ హేమంత్ వర్మ మాట్లాడుతూ రామప్ప శిల్పాలలో జీవకళ ఉట్టిపడుతోందన్నారు. రాతిపై చెక్కిన ప్రతీ కళాఖండం కళాత్మక వైభవానికి చిహ్నం అని, రామప్ప దేవాలయం చరిత్రను, వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. ఎంతో ఘన చరిత్ర గల ఆలయాన్ని సందర్శించడం తనకు సంతోషంగా ఉందన్నారు. అనంతరం హేమంత్ వర్మ దంపతులు లక్నవరం సరస్సులోని సస్పెన్షన్ వంతెనపై విహరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. కాగా, రామప్ప దేవాలయాన్ని సందర్శించిన వారిలో ఇంగ్లాండ్‌కు చెందిన దంపతులు మిచెల్ రిచర్డ్, ఎలిజబెత్ కూడా ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ డి.ఈ (ఆపరేషన్) ములుగు పులుసం నాగేశ్వర్‌రావు, ఏడీఈ వేణుగోపాల్, విజిలెన్స్ ఎస్.ఐ. పురుషోత్తం, ఏ.ఈ. రమేష్, కిషోర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


