జంపన్న వాగులో నీట మునిగిన వ్యక్తి
కాపాడిన భద్రతా సిబ్బంది.. పరిస్థితి విషమం
మేడారం ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్న వైద్యులు
కాకతీయ, మేడారం బృందం : మేడారంలో పుణ్యస్నానం ఆచరించేందుకు జంపన్నవాగులో దిగిన కర్మోష్ శేఖర్ అనే వ్యక్తి నీట మునిగిపోగా.. భద్రతా సిబ్బంది కాపాడారు. అయితే పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడి స్వస్థలం సైదాబాద్ మండలం చంచల్‌గూడగా అధికారులు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలిపారు. మేడారంలో ఏర్పాటు చేసిన వైద్య శాలలో చికిత్స అందజేస్తున్నారు.



