కార్తీక పౌర్ణమి వేళ క్షుద్ర పూజలు..
వరంగల్ జిల్లాలో కలకలం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఎల్లంద గ్రామంలో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న క్షుద్రపూజలు. కార్తీక పౌర్ణమి రోజున క్షుద్రపూజలు నిర్వహించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో ఇటీవలి కాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, పోలీసులు నిఘా పెట్టి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


