epaper
Thursday, January 29, 2026
epaper

గౌర‌వం ద‌క్క‌లేదు

గౌర‌వం ద‌క్క‌లేదు

జ‌ట్టులో మ‌ద్ద‌తూ ల‌భించ‌లేదు

కోరుకున్న స్థానం పొంద‌లేక‌పోయా

అందుకే క్రికెట్‌కు గుడ్ బై చెప్పా

యువరాజ్​ సింగ్ హాట్ కామెంట్స్‌

కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్‌: భారత అత్యుత్తమ క్రికెటర్లలో మాజీ ప్లేయర్ యువరాజ్​ సింగ్ ఒకరు. టీమ్ఇండియా 2011 వన్డే వరల్డ్​కప్​ నెగ్గడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. ఇదొక్కడే కాకుండా కెరీర్​లో యువీ అనేక ఘనతలు అందుకొని లెజెండరీ బ్యాటర్​గా పేరు సంపాదించాడు. అలాంటి యువీ 2019 వన్డే వరల్డ్​కప్​లో స్థానం దక్కకపోవడంతో క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా తన రిటైర్మెంట్ గురించి యువీ మాట్లాడలేదు. అయితే ఏడేళ్ల తర్వాత తొలిసారి యువీ తన రిటైర్మెంట్ కారణాలు వెల్లడించాడు. రెండు ప్రధాన కారణాల వల్లే తాను ఆటకు గుడ్​ బై చెప్పినట్లు యువీ తెలిపాడు. ఈ మేరకు తాజాగా మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో కలిసి ఓ పాడ్​కాస్ట్​లో పాల్గొన్న యువీ కీలక వ్యాఖ్యలు చేశాడు. “రిటైర్మెంట్​కు ముందు, నా ఆటను నేను ఆస్వాదించలేకపోయాను. జట్టులో నాకు తగిన మద్దతు, గౌరవం లభించడం లేదని నాకు అనిపించడం మొదలైంది. అప్పుడు నేను క్రికెట్ ఆడటం ఎందుకు కొనసాగించాలి? అని ఆలోచించడం మొదలుపెట్టా? నేను కోరుకున్నది నాకు లభించనప్పుడు, నేను ఇంకా ఏం నిరూపించుకోవాలి అని అనిపించింది. అలాగే, నేను మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఇంతకన్నా ఏం చేయలేనని అనిపించింది. అందుకే రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. నేను క్రికెట్​కు గుడ్​ బై చెప్పిన తర్వాత తర్వాత నేను సాధారణ స్థితికి వచ్చాను” అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.

యువరాజ్ కెరీర్

2000 సంవత్సరంలో యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేశాడు. కెన్యాతో తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. ఇక 2017లో చివరి వన్డే ఆడాడు. మొత్తం 304 వన్డేల్లో 8,701 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే కెరీర్‌లో 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో 1,900 పరుగులు చేశాడు. టెస్టుల్లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు చేశాడు. టీ20ల్లో తనదైన ముద్ర వేశాడు. 58 మ్యాచ్​ల్లో 1,177 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్​గా యువీ అంతర్జాతీయ కెరీర్​లో 11,778 పరుగులు, 148 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఐపీఎల్​లో 132 మ్యాచ్‌ల్లో 2,750 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు చేశాడు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్ ఏ ప్ల‌స్‌ గ్రేడ్​ రద్దు బీ కేటగిరీలోకి...

గంభీర్ శిక్ష‌ణ‌కు ప‌రీక్ష‌

గంభీర్ శిక్ష‌ణ‌కు ప‌రీక్ష‌ టీమ్ఇండియాకు 5 చేదు జ్ఞాపకాలు ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న చెత్త రికార్డులు...

బంగ్లాదేశ్‌కు డెడ్‌లైన్‌

బంగ్లాదేశ్‌కు డెడ్‌లైన్‌ ఈనెల 21లోపు తుది నిర్ణయాన్ని తెల‌పాలి లేదంటే ప్రత్యామ్నాయాలు ఉన్నాయ్ ఐసీసీ...

ఆట‌కు వీడ్కోలు ప‌లికిన సైనా నెహ్వాల్

ఆట‌కు వీడ్కోలు ప‌లికిన సైనా నెహ్వాల్ కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : భారత...

చరిత్ర సృష్టించిన వీనస్ విలియమ్స్..

చరిత్ర సృష్టించిన వీనస్ విలియమ్స్.. 45 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్...

గంభీర్.. నీకో దండం!

గంభీర్.. నీకో దండం! టీమిండియాను వదిలేయ్! భార‌త్ క్రికెట్ కోచ్‌పై ఫ్యాన్స్ ఫైర్ హెడ్ కోచ్...

ఫామ్​లోనే రోహిత్

ఫామ్​లోనే రోహిత్ ఒక్క సిరీస్ ప్రదర్శన ఆధారంగా విమ‌ర్శించ‌డం త‌గ‌దు హిట్​మ్యాన్​కు ​గిల్ మద్దతు కాక‌తీయ‌,...

ఫీల్డింగే ముంచింది

ఫీల్డింగే ముంచింది మిడిల్ ఓవర్లలో ఫీల్డర్ల ఉదాసీనత చాలా తేలికగా సింగిల్స్ ఇచ్చేశారు బౌలర్లు సృష్టించిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...
spot_img

Popular Categories

spot_imgspot_img