25వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థిగా కటకం లోకేష్ నామినేషన్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ 25వ డివిజన్ (సుభాష్‌నగర్) నుంచి బీజేపీ అభ్యర్థిగా కటకం లోకేష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 25వ డివిజన్ ప్రజల ఆశీస్సులతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. డివిజన్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.


