కాకతీయ, గీసుగొండ: మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ప్రతి రెండేళ్లకోసారి అమ్మవారికి బోనాలు నిర్వహించడం ఈ గ్రామ సంప్రదాయం. ఈ నేపథ్యంలో శుక్రవారం పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, హారతులతో వాతావరణం ఆధ్యాత్మికంగా మారిపోయింది. డప్పు చప్పుళ్ళు, పోతురాజుల నృత్యాలతో ఆడపడుచులంతా బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా బయలుదేరారు. అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి బోనాలు సమర్పించారు.


