మూడోసారి బరిలో మాజీ మేయర్ సునీల్‌రావు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ 42వ డివిజన్ భగత్‌నగర్ నుంచి బీజేపీ నేత, మాజీ మేయర్ వై. సునీల్‌రావు మూడోసారి మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగారు. గతంలో రెండు సార్లు విజయం సాధించి ఒక టర్మ్ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆయన, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఆయన తన నామినేషన్‌ను అధికారికంగా దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఘనంగా మద్దతు ప్రకటించారు. భగత్‌నగర్ డివిజన్‌ను మరింత అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా మరోసారి ప్రజల ముందుకు వస్తున్నానని వై. సునీల్‌రావు ఈ సందర్భంగా తెలిపారు.


