కాకతీయ, ఆత్మకూరు : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నాగెల్లి ఆనందం కుటుంబానికి అండగా ఉంటామని ఇందిరానగర్ కాలనీ వాసులు తెలిపారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఈ పరామర్శలో ఆత్మకూరు మాజీ సర్పంచ్ నాగెల్లి సామెల్, కాలనీ వాసులు కుమార్, తనుగుల శంకర్, కోగిలా చక్రపాణి, జన్ను సాంబయ్య, మంద రవి,పెరుమాండ్ల శివ తదితరులు పాల్గొన్నారు.


