కాకతీయ, పరకాల: సోమవారం పరకాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం,లో నిర్వహించిన పరకాల,నడికూడ,దామెర, ఆత్మకూరు,మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,ప్రతి వారం గ్రామాలలో సమావేశాలు నిర్వహించాలని అన్నారు.
గ్రామంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై సమీక్షించి సమావేశంలో గత ప్రభుత్వ వైఫల్యాలు,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలన్నారు.గత ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో దోచుకుతిన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.పాత, కొత్త లేకుండా అందరూ కలిసి కట్టుగా సమన్వయంతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కమిటీ సభ్యులను కోరారు.


