మేడారంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు
చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత
కాకతీయ, మేడారం బృందం : సమ్మక్క–సారలమ్మ మహాజాతర నేపథ్యంలో మేడారంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేకుండా ప్రతి ప్రాంతాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెలపైకి రానున్న కీలక ఘట్టాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ ప్రాంగణం చుట్టూ పోలీస్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ బృందాలు సోదాలు నిర్వహించాయి


