- న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య
కాకతీయ, బయ్యారం : పూటకో పార్టీ మారే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బయ్యారం సోసైటీ మాజీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి తమ పార్టీ పై తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరమని, ఆయన వాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య బుధవారం అన్నారు. గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ రెడ్డి నిరసన రిలే నిరాహార దీక్ష చేస్తుంటే ఆయనకు సంఘీభావం తెలియజేశామన్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ పైన అనేక తప్పుడు విమర్శలు చేయడం తగదన్నారు. ఎర్ర భూస్వాముల పార్టీగా పేర్కొనడం దుర్మార్గమని,ఎక్కడ తమ పార్టీ నాయకులు వందల ఎకరాలు కలిగి ఉన్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తుడుం వీరభద్రం, ఏపూరి వీరభద్రం, నేతకాని రాకేష్, యాకూబ్ పాష, కొదుమూరి నాగేశ్వరరావు, దొడ్డి తిరుమలేష్, ధరావత్ మంగీలాల్, వీరబోయిన ఐలయ్య, ఏనుగుల మురలళీ, కూనూరి యుగంధర్, రెడ్డిమల్ల విశ్వనాధం, పొన్నం శ్రీను, సోమారపు సుధాకర్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.


