ఎక్సైజ్ శాఖలో వేధింపుల పర్వం
నిద్రమాత్రలు మింగిన లేడీ కానిస్టేబుల్
వ్యక్తిగతంగా సీఐ దూషించినట్లుగా ఆరోపణలు
కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ శాఖలో కలకలం
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ఉద్యోగరీత్యా వ్యక్తిగత విషయాలు తెలియదు గాని ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న మహిళ కానిస్టేబుల్ పై అదే శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారి నిత్యం వేధింపులకు పాల్పడింది. దీంతో మనస్థాపానికి చెందిన సహచర ఉద్యోగి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో శుక్రవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ను ఆమె వ్యక్తిగత కారణాలవల్ల అదే శాఖలో పనిచేస్తున్న అధికారి( సీఐ క్యాడర్) ఆమెపై విచక్షణంగా ప్రవర్తిస్తూ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావ్ నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి నీ ప్రవర్తన మార్చుకోవాలి మీ ప్రవర్తన బాగాలేదు అంటూ తరచు వేధింపులకు గురిచేసింది. దీంతో మనస్థాపానికి గురైన ఆ మహిళ కానిస్టేబుల్ శుక్రవారం సాయంత్రం డ్యూటీ నిమిత్తం ఇంటికి వెళుతూ సిట్రజన్ టాబ్లెట్లను మింగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె నివాసం తిరువూరు దగ్గర వియ్యం బంజర అన్నట్లు సమాచారం. నిద్రమాత్రలు మింగిన ఆ మహిళ కానిస్టేబుల్ ఇంటికి చేరుకోగానే ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె తల్లిదండ్రులు ఎంత పిలిచినా ఆమె పలుకక పోయేసరికి భయంతో సమీపంలోని ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ తల్లిదండ్రులు జిల్లా ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న సిఐను నిలదీసేందుకు శనివారం ఉదయం వచ్చారు. అప్పటికే ఆమె అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహించి మరొక్కసారి ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటే మాత్రం సహించేది లేదంటూ హెచ్చరించి వెళ్లినట్టు సమాచారం.
నేను ఎవరిని ఎమి అనలేదు నాకేం సంబంధం లేదు ; ఫోన్లో వివరణ ఇచ్చిన సీఐ
వేధింపులు గురి చేస్తున్నానంటూ ఒక మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్యయత్నానికి పాల్పడం నాకు ఎలాంటి సంబంధం లేదని నేను ఎవరిని వేధింపులు గురి చేయలేదని అందరూ కలిసికట్టుగా ఉద్యోగం చేస్తామని ఎక్సైజ్ శాఖ సీఐ పలు ఆరోపణలపై వివరణ ఇచ్చారు.


