కాకతీయ, పాలకుర్తి : జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. ప్రగతి విద్యానిలయం ఆవరణలో ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట ఉపాధ్యక్షుడు పెందోటి వెంకటాచారి, మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనపురం వెంకన్న గౌడ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం మండలకేంద్రంలోని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, తొర్రూర్, రాయపర్తి, పెద్దవంగర అధ్యక్షులుగా లొంక మల్లేష్, మేకపోతుల వెంకటేశ్వర్లు, సోమనాథం, హనుమంత్, మహ్మద్ నహీం, ఎస్కే. సలీం, దేవరుప్పుల మండల ప్రధాన కార్యదర్శిగా సాదు రఘునాథ్ రెడ్డి, నియోజక వర్గ అధ్యక్ష కార్యదర్శులుగా లొంక మల్లేష్,కొంగ సతీష్,వర్కింగ్ ప్రసిడెంట్ గా సింగారి భీమయ్య, సహాయ కార్యదర్శిగా ఎం.విజయ్ కుమార్, కోశాధికారిగా మహ్మద్ నహీమ్, అధికార ప్రతినిధిగా సోమేశ్వర రావు, ఉపాధ్యక్షులుగా అన్నం వెంకన్న, గడ్డ రాజమౌళి, ఎస్కే.సలీమ్, కార్యవర్గ సభ్యులుగా దండు రమేశ్, గరిగంటి ప్రభాకర్, వెంకన్న, నల్ల రాంచందర్, పి. వెంకన్న, కోట శ్రీనివాస్, శ్రీశైలంలను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.


