కాకతీయ, రామకృష్ణాపూర్ : పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


