- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య
కాకతీయ, ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ మండలం జక్కలొద్దీ గుడిసె సెంటర్ లో సీపీఎం అధ్యక్షుడు రామ సందీప్ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.నాగయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జక్కలొద్దీ గుడిసె సెంటర్ ఏర్పాటు చేసి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అవుతోందన్నారు. ఇప్పటివరకు దానిని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. గుడిసెల్లో నివసిస్తున్న వారంతా ఎస్సీ, బీసీ, మైనార్టీ పేద ప్రజలని తెలిపారు. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ గెలిస్తే పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
కానీ గెలిచిన తర్వాత ఇప్పటివరకు కూడా ఆ హామీల అమలు కోసం ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం చాలా దారుణమైన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలందరూ కాంగ్రెస్ ను ఓట్లు వేసి గెలిపించిన వారేనని వెంటనే ప్రభుత్వం వీరికి పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పేద ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు నళిగంటి రత్నమాల, సింగారపు బాబు, ఆరూరి కుమార్, జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు వల్ల దాసు దుర్గయ్య, రంగసాయిపేట నాయకులు జ్యోతి, బన్న కృష్ణ ఉసిల్ల కుమార్, కవిత, సాంబమూర్తి రాకేష్, ఉమ్మడి శ్రీనివాస్, మైదం వినోద, పూల రాకేష్, దుప్పటి రమ్య, గాద లక్ష్మణ్, పూల రేష్మ, చెలగాని రాజు, ఉమాదేవి, చేగోండ రాజు, సట్ల రజిత, జన్ను సంపత్, ప్రవీణ్, మొగుల్లో సునీల్, ఎంబడి వెంకటేశ్వర్లు, పున్నం, కొంగర వంశీ, సరూప, సుగుణమ్మ, గోష్కా, అనిత, గాదం జయ, నీలమ్మ, మొగుళ్ళు అనిల్, యాకూబ్ పాషా, పుట్ట అనిల్, సంపత్ పాల్గొన్నారు.


