బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
కాకతీయ, గీసుగొండ : ఇటీవల అనారోగ్య కారణాలతో మృతిచెందిన వారి బాధిత కుటుంబాలకు జిల్లా కాంగ్రెస్ నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. మండలంలోని మనుగొండ గ్రామానికి చెందిన బాధ రామలక్ష్మి, కంబాల రాంబాబు అనారోగ్య కారణాల చేత అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న అల్లం బాలకిషోర్ రెడ్డి, స్వప్నదేవి దంపతులు మానవతా దృక్పథంతో ఒక్కో కుటుంబానికి ఐదువేల ఆర్థిక సాయాన్ని అల్లం మర్రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాదాసి రాంబాబు, గాడుదుల బొంద్యాలు, ఎంబాడి పరమేష్, తోట కమలాకర్, మర్రి చిన్న ఎల్లయ్య, గుండ కొమ్మాలు, సర్కిటి రాజయ్య, బాధ శేఖర్, కాయిత అశోక్, చాపర్తి రాజు, గాడుదుల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.


