కాకతీయ, తుంగతుర్తి: కార్తీక మాస పాఢ్యమి కావడంతో శివభక్తులు పెద్ద సంఖ్యలో శివమాల ధరించారు. శివగురుస్వామి, ఆలయ ప్రధాన అర్చకులైన డా. యర్ర హరి కిషన్ ఆధ్వర్యంలో తుంగతుర్తి మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 50 మందికి పైగా శివభక్తులు శివ దీక్షలు స్వీకరించారు. మరో అరవై మంది పాలకుర్తి లో శివదీక్ష స్వీకరించారు. వారందరూ డిసెంబర్ 3న తుంగతుర్తి శివాలయంలో జ్యోతిర్ముడి స్వీకరించి శ్రీ శైలంలో దీక్ష విరమణ చేస్తారు. కార్యక్రమంలో జే సోమన్న, మధు, వెంకన్న, గణేశ్, నవీన్, మల్లయ్య, గణేశ్, తదితరులు పాల్గొన్నారు.


