- దండారి పండుగకు చెక్కులివ్వని కాంగ్రెస్ ప్రభుత్వం
- సోనాల మండలం మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్
కాకతీయ ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ కేశవ్ గూడ మహాదు గూడ గ్రామాల ప్రజలకు ఎంప్లి, సాండ్ బాక్సులను అందజేశారు. దండారి దీపావళి పండుగ సందర్భంగా శనివారం మండలంలోని రెండు గ్రామాల్లో పర్యటించిన తుల శ్రీనివాస్ తన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో గిరిజనులు ఎంతో సంతోషంగా ఉండేవారని అన్నారు. వారి సంస్కృతిని గుర్తించి ప్రతి గిరిజన గుడాలకు రూ.10 వేల చొప్పున చెక్కులను అందించే వారనిగుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు దండారి చెక్కులు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో బోథ్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, ప్రశాంత్, యువ నాయకులు ఈర్ల అభిలాష్ యల్ల, సుధీర్ రెడ్డి, తుల హరీష్ తదితరులు పాల్గొన్నారు.


